సారథి న్యూస్, చొప్పదండి: చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు సరికాదని రామడుగు మండల టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కల్గెటి లక్ష్మణ్ ఆక్షేపించారు. స్థాయి తగ్గి మాట్లాడొద్దని హితవుపలికారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ పెట్టిన భిక్షతో శోభ జడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా గెలుపొంది, ఇప్పుడు టికెట్ రాకపోయే సరికి బీజేపీలో చేరి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. గతంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తమ కుటుంబసభ్యులు అని చెప్పి ఇప్పుడు వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదన్నారు. గతంలో శోభ నోటి దురుసు వల్లనే టీఆర్ఎస్ అధిష్టానం పార్టీ టికెట్ ఇవ్వలేదన్నారు. టికెట్ రాకపోతే బీజేపీని కూడా ఇలాగే తిడుతుందని అన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గట్ల జితేందర్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు ఎడవెల్లి నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ మారుకొండ కృష్ణారెడ్డి, మాజీ అధ్యక్షుడు జూపాక కర్ణాకర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అజయ్, తీర్మాలపూర్ సర్పంచ్ బక్కశెట్టి నర్సయ్య, శనగర్ మాజీసర్పంచ్ గునుగొండ అశోక్, రామడుగు మాజీ సర్పంచ్ పంజాల జగన్మోహన్రెడ్డి, సీనియర్ నాయకులు వివేకానంద, పూడూరి మల్లేశం, తడగొండ హన్మంత్ పాల్గొన్నారు.
- March 9, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- BODIGE SHOBHA
- CHOPPADANDI
- CM KCR
- కేటీఆర్
- చొప్పదండి
- బొడిగే శోభ
- సీఎం కేసీఆర్
- Comments Off on శోభక్క నోటికొచ్చినట్లు మాట్లాడకు..