- కేసులకు భయపడి వెనకడుగు వేసేది లేదు
- బీజేపీ నాగర్కర్నూల్ ఇన్చార్జ్ దిలీప్ ఆచారి
సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: నాగర్కర్నూల్ నియోజకవర్గంలోని చెరువుల్లో నల్లమట్టిని అక్రమంగా తరలించి వందల కోట్ల రూపాయలు గడించిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిని వదిలే ప్రసక్తే లేదని బీజేపీ నాగర్కర్నూల్ ఇన్చార్జ్ దిలీప్ ఆచారి అన్నారు. శుక్రవారం నాగర్ కర్నూల్ లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నల్లమట్టి అక్రమాలపై చర్చించేందుకు ఎక్కడికి రమ్మన్నా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎమ్మెల్యే చేసిన అక్రమాలపై వెనకడుగు వేసేది లేదని, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిని ప్రజాకోర్టులో నిలబెట్టి తీరుతామని ఆయన హెచ్చరించారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ముమ్మాటికీ నల్లమట్టి దొంగ అని, ఉయ్యాలవాడ రైతు కాశన్న ఆత్మహత్యకు కారణమయ్యారని ఆరోపించారు. పెద్దమొత్తంలో చెరువులో నీటిని నిల్వచేయడంతో అక్కడి రైతులు నిర్వాసితులుగా మారారని వివరించారు. తమపై ఎన్ని కేసులు పెట్టినా బీజేపీ వెనకడుగు వేసేది లేదని, దీనిపై న్యాయపరంగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.