సారథి న్యూస్, మెదక్: పోతంశెట్టిపల్లి– ఏడుపాయల రోడ్డు నిర్మాణం, ఇతర పనుల కోసం సీఎం కేసీఆర్ రూ.31.31కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్సీ, కేసీఆర్ రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ రోడ్డు నిర్మాణానికి గతంలో రూ.19 కోట్లు మంజూరుకాగా, వాటితో వంతెనలు నిర్మించారని చెప్పారు. మహాశివరాత్రి జాతరలోగా పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన నీటిపారుదల శాఖ అధికారులను కోరారు. మంజూరైన నిధుల ద్వారా సీసీరోడ్లు, వంతెనలు, వంతెనపై ఫుట్‌పాత్ తదితర పనులు చేపడతారని ఆయన తెలిపారు. నిత్యం వేలసంఖ్యలో ఏడుపాయలకు వచ్చే భక్తులకు వంతెన నిర్మాణంతో ఇబ్బందులు తీరుతాయని చెప్పారు. ఏడుపాయల పోతంశెట్టిపల్లి రహదారిలో వంతెన నిర్మాణం కోసం అడిగిన వెంటనే నిధులు మంజూరుచేసిన సీఎం కేసీఆర్‌కు జిల్లా మంత్రి టి.హరీశ్‌రావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
- January 22, 2021
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- EDUPAYALA
- MAHASHIVA RATHRI
- POTHAMSHETTTY
- ఏడుపాయల
- పోతంశెట్టిపల్లి
- మహాశివరాత్రి
- మెదక్
- Comments Off on పోతంశెట్టిపల్లి రోడ్డుకు మోక్షం