సామాజిక సారథి, చొప్పదండి: నెహ్రూ యువ కేంద్రం కరీంనగర్, నవతరం యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం కరీంనగర్ రూరల్, చొప్పదండి మండలాల యూత్ క్లబ్ డెవలప్మెంట్కార్యక్రమాన్ని స్థానిక వైశ్య భవన్లో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీపీ చిలక రవీందర్ మాట్లాడుతూ.. యువజన సంఘాలు అభివృద్ధి, చైతన్య కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అలాంటి వారికి తాను పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్రం అధికారి బి.రవీందర్, నవతరం యువజన సంఘం అధ్యక్షుడు అనుకారి సాయికృష్ణ, ప్రధాన కార్యదర్శి శివకృష్ణ, వలంటీర్గుడెల్లి లక్ష్మీపతి, జయసింహరెడ్డి, యువజన సంఘం నాయకులు రాకేష్, సాయి, మహేష్, ప్రశాంత్, శ్రీనివాస్, శ్రావణ్, 50 మంది సభ్యులు పాల్గొన్నారు.
- September 4, 2021
- Top News
- CHOPPADANDI
- navatharam
- నవతరం యూత్
- నెహ్రూ యువకేంద్రం
- Comments Off on అభివృద్ధిలో భాగస్వాములు కావాలి