Breaking News

మున్సిపల్ ​కార్మికులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి

మున్సిపల్​కార్మికులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి

సారథి, చొప్పదండి: చొప్పదండి మున్సిపల్​ ఆఫీసులో చైర్ పర్సన్ గుర్రం నీరజారెడ్డి అధ్యక్షతన కమిషనర్ అంజయ్య ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బందికి బ్లాంకెట్స్, బల్బ్స్, ఆఫ్రాన్స్, హెల్మెట్స్, గమ్ బూట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్​ చైర్​పర్సన్​ మాట్లాడుతూ.. కార్మికులు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ ఇప్పనపెళ్లి విజయలక్ష్మి, కౌన్సిలర్లు మాడూరి శ్రీనివాస్, కొత్తూరి మహేష్, కోఆప్షన్ సభ్యుడు ఎండీ అజ్జు, నాయకులు నలుమాచు రామకృష్ణ, కొత్తూరి నరేష్, పెరుమాండ్ల గంగయ్య, చేపూరి సత్యనారాయణ, ఎండీ ఖాజాఅలీ, మున్సిపల్ ​మేనేజర్ డి.ప్రశాంత్, హెల్త్ అసిస్టెంట్ మహేష్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.