సారథి, వేములవాడ: రాష్ట్రంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి బుధవారం దర్శించుకున్నారు. కోడె మొక్కులు చెల్లించుకున్న అనంతరం స్వామివారిని మంత్రి దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయ ఈవో, అధికారులు, అర్చకులు ఘనస్వాగతం పలికారు. మహామండపంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఆలయ ఈవో కృష్ణప్రసాద్ చిత్రపటం, ప్రసాదం అందజేసి సత్కరించారు. మంత్రి వెంట ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్, కలెక్టర్ కృష్ణభాస్కర్ తదితరులు ఉన్నారు.
వసతిగృహాల ప్రారంభం
వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నూతనంగా నిర్మించిన భీమేశ్వర భవనం(భక్తుల వసతిగృహాలు) సముదాయాన్ని బుధవారం దేవాదాయశాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుతో కలసి ప్రారంభించారు. దేవాదాయశాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్, ఇతర అధికారులు స్వామివారిని దర్శించుకున్నారు.