సారథి, మానవపాడు: పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసాలు చేస్తూ అందరి శ్రేయస్సు కోసం కులమతాలకు అతీతంగా ప్రార్థనలు చేయడం సంతోషంగా ఉందని డాక్టర్ మెడికల్ హుస్సేన్ అన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో ఉపవాసాలు చేస్తూ సాయంత్రం వేళల్లో యువకులు ఆహ్లాదం కోసం కాసేపు క్రికెట్ ఆడటం సంతోషమన్నారు. క్రీడాకారులను దృష్టిలో ఉంచుకుని ఆయన రూ.ఆరువేల క్రికెట్ కిట్టును మానవపాడులోని జామియా మసీదు ఆవరణలో అందజేశారు. అలాగే వీఆర్వో హుస్సేన్ రూ.వెయ్యి నగదు, షాకీర్ రూ.వెయ్యి నగదు, టీచర్ శాలం రూ.వెయ్యి నగదును అందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆటలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని, ప్రతిఒక్కరూ కనీసం ఓ గంటపాటు ఆడుకుంటే శారీరకంగా, మానసికంగా ఉంటారని చెప్పారు. కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న నేపథ్యంలో సామాజిక దూరం పాటించడంతో పాటు, మాస్కు తప్పనిసరిగా ధరించాలన్నారు. కార్యక్రమంలో మండల మాజీ కోఆప్షన్ సభ్యుడు డాక్టర్ అబ్దుల్ అజీమ్, మహమ్మద్, చోటా, ఖలీమ్, క్రికెట్ క్రీడాకారులు ఖలీల్, ఆర్షద్, మహమ్మద్ శాలి, కుద్దూస్ పాల్గొన్నారు.