సారథి, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం బూడిదపాడు గ్రామంలో విద్యుత్ షాక్ తో షేక్షావలి(60) అనే వ్యక్తి మంగళవారం మృతి చెందాడు. గ్రామంలో రోజు మాదిరిగానే నర్సరీలో మొక్కలకు నీళ్లుపడుతుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే కన్నుమూశాడు. షేక్షావలి ఉపాధి సేవకుడిగా పనిచేస్తున్నాడని, రోజు మాదిరిగానే నీళ్లు పడుతుండగా ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు తెలిపారు. ఈ మేరకు శాంతినగర్ ఎస్సై శ్రీహరికి సమాచారం అందించారు. ఆయన సంఘటనస్థలాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.
- July 20, 2021
- Archive
- క్రైమ్
- CRIME
- UNDAVELLI
- ఉండవెల్లి
- కరెంట్‌షాక్
- Comments Off on విద్యుత్‌షాక్‌తో వ్యక్తి మృతి