సారథి, బిజినేపల్లి: రాష్ట్రంలోనే పెద్దమండలంగా ఉన్న నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం నుంచి మంగనూర్ను వేరుచేసి మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని మాజీ జడ్పీటీసీ సభ్యుడు, జిల్లా ప్లానింగ్కమిటీ మాజీ సభ్యుడు, న్యాయవాది సి.పరశురాములు జిల్లా కలెక్టర్ఎల్.శర్మన్ను కోరారు. మంగనూర్శ్రీశైలం– రాయిచూర్ హైవేపై ఉన్నదని, చుట్టుపక్కల గ్రామాలకు అందుబాటులో ఉందని తెలిపారు. అధిక జనాభా కలిగిన మండలాన్ని రెండు మండలాలుగా చేస్తే ప్రజలకు పాలన చేరువుతుందని, అధికారులకు విధులు మరింత సులువు అవుతాయని వివరించారు. మండలంలో లక్ష పైచిలుకు జనాభా ఉండటంతో అధికారులపై పనిభారంతో అన్ని పనులను సకాలంలో పూర్తిచేయలేకపోతున్నారని తెలిపారు. కావునా ప్రజల ఆకాంక్షను గౌరవించి మండల కేంద్రంగా చేయాలని ఆయన కోరారు.
- July 9, 2021
- Archive
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- BIJINEPALLY
- manganur
- new mandal
- నాగర్ కర్నూల్
- బిజినేపల్లి
- మంగనూర్
- Comments Off on మంగనూర్ను మండలం చేయండి