సారథి, రామగుండం ప్రతినిధి: ఏప్రిల్ మాసంలో జరిగే మహనీయుల జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించాలని కోరుతూ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పి.ఉదయ్ కుమార్ కు ఉత్సవాల కమిటీ నేతలు వినతిపత్రం అందజేశారు. ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్ రాం, 11న మహాత్మా జ్యోతిరావుపూలే, 14న భారతరత్న డాక్టర్బీఆర్బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున విగ్రహాలకు కలర్లు వేయించి, పరిసర ప్రాంతాలను శుభ్రం చేయించాలని విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ ఇరుకుల్ల రాజనరసయ్య, జనరల్ సెక్రటరీ మాదాసి రామ్మూర్తి, కోఆర్డినేటర్ వడ్డేపల్లి శంకర్, ముఖ్య సలహాదారులు కొంకటి లక్ష్మణ్, బొంకూరి మధు, కోకన్వీనర్ కాంపల్లి సతీష్, వైస్ చైర్మన్లు శనిగరం రామస్వామి, ఇరుగుర్రాల కృష్ణయ్య, శనిగరం హరీశ్, యాసాల చిరంజీవి, గద్దల శశిభూషణ్, పంజా అశోక్, రాచూరి నరసింహారావు, కొంకటి సిద్ధార్థ, బొంకూరి పవన్ కుమార్, సాయి పాల్గొన్నారు.