సారథి, జగిత్యాల: జగిత్యాల జిల్లా కలెక్టర్ క్యాంపు ఆఫీసులో అంగన్ టీచర్లు, ఆయాలకు వివిధ సంస్థలు వితరణగా అందజేసిన శానిటైజర్, ఫేస్ షీల్డ్, మాస్కులను కలెక్టర్ జి.రవి శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలం ప్రారంభమై వాతావారణంలో సంభవించే మార్పుల కారణంగా ప్రజలు మలేరియా, డెంగీ వంటి అనారోగ్యాలకు పాల్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రోడ్లపై మురుగునీరు నిలువకుండా చూడాలని సూచించారు. అనారోగ్యాల బారినపడి అప్పులు తీసుకొచ్చి వైద్యం చేయించుకునే దుస్థితి కలగకుండా ఇంటి లోపల, బయట ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా అవగాహన కల్పించాలన్నారు. అధికారులంతా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా మహిళా, పిల్లలు, వయోవృద్ధుల సంక్షేమ అధికారి భోనగిరి నరేష్, జిల్లా పిల్లలహక్కుల పరిరక్షణ అధికారి హరీశ్, సీడీవో జగిత్యాల వీరలక్ష్మి, అంగన్ వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.
- June 12, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- CARONA
- COVID19
- JAGITYALA
- కరోనా
- కొవిడ్ 19
- జగిత్యాల
- Comments Off on పారిశుద్ధ్యం కోసం కలిసికట్టుగా పనిచేద్దాం