Breaking News

శాంతియుతంగా వినాయక ఉత్సవాలు

శాంతియుతంగా వినాయక ఉత్సవాలు

సామాజిక సారథి, పెద్దశంకరంపేట: ప్రజలంతా శాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలను జరుపుకోవాలని పెద్దశంకరంపేట ఎస్సై నరేందర్ అన్నారు. ఆదివారం పెద్దశంకరంపేట  పోలీస్ స్టేషన్ లో ఎంపీపీ జంగం శ్రీనివాస్ అధ్యక్షతన అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు గణేష్ మండపాల నిర్వాహకులతో నిర్వహించిన శాంతి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 10న వినాయకచవితి పండుగను పురస్కరించుకుని తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. వినాయక నవరాత్రి ఉత్సవాలు ముగిసే వరకు ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని, అందుకు నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు. ప్రతి వినాయక మండపం వద్ద ఇద్దరు వలంటీర్లు తప్పనిసరిగా ఉండాలని, ఊరేగింపు సమయంలో డీజేలకు అనుమతి లేదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలతో పాటు కేసులు నమోదు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, వైస్ ఎంపీపీ లక్ష్మీరమేష్, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు మురళిపంతులు, ఎంపీటీసీ వీణా సుభాష్ గౌడ్, దత్తు, మండల సర్పంచ్​ల ఫోరం అధ్యక్షుడు కుంట్ల రాములు, ఆర్యన్ సంతోష్, ఆయా గ్రామాల సర్పంచ్​లు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.