సామాజిక సారథి, పెద్దశంకరంపేట: ఉపాధ్యాయులు విద్యాభివృద్ధికి కృషిచేయాలని పెద్దశంకరంపేట ఎంపీపీ జంగం శ్రీనివాస్ అన్నారు. గురుపూజోత్సవం సందర్భంగా ఆదివారం పెద్దశంకరంపేట ఎంపీడీవో ఆఫీసు ఆవరణలో పలువురు ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భావితరాల పౌరులను తీర్చిదిద్దే బాధ్యత టీచర్లదేనని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుందన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ లక్ష్మీరమేష్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళి పంతులు, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు రాములు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు దత్తు, రైతుబంధు అధ్యక్షుడు సురేష్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచ్లు, నాయకులు జగన్మోహన్ రెడ్డి, శంకర్ గౌడ్, విఠల్ గౌడ్, అశోక్ ఉన్నారు.
- September 5, 2021
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- peaddashankarampet
- TEACHERS DAY
- గురుపూజోత్సవం
- పెద్దశంకరంపేట
- Comments Off on విద్యాభివృద్ధికి కృషిచేద్దాం