సారథి, అలంపూర్(మానవపాడు): ఎలాంటి ఆదాయవనరు లేకపోయినా, చాలీచాలని వేతనాలతో గ్రామాల్లో ధూప దీప నైవేద్య పథకం కింద పనిచేసే అర్చకులను ఇటీవల కొందరు పెత్తందారులు వేధింపులకు పాల్పడుతున్నారని అర్చకసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనంద్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అర్చకులకు వచ్చే వేతనాల్లో తమకు వాటా ఇవ్వాలని వేధింపులకు పాల్పడటం శోచనీయమని పేర్కొన్నారు. ధూప దీప నైవేద్యం పథకం కింద ప్రభుత్వం ఇచ్చే రూ.ఆరువేల వేతనంలో రూ.రెండువేలు పూజాసామాగ్రికే సరిపోతుందని, ఇక మిగిలిన రూ.నాలుగువేలతో అర్చకులు వారి కుటుంబాన్ని ఎలా పోషించుకుంటారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇకనైనా పద్ధతి మార్చుకోకపోతే వారి ఇళ్ల వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
- July 22, 2021
- Archive
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- ALAMPUR
- dhupa deepam scheme
- అర్చకులు
- అలంపూర్
- ధూప దీప నైవేద్యం
- Comments Off on అర్చకులను వేధిస్తే ఊరుకోం..