సారథి, నాగార్జునసాగర్: మాలలు అందరూ ఐక్యంగా ఉండి అభివృద్ధిని సాధించుకోవాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య పిలుపునిచ్చారు. మాలలు ఐక్యంగా ఉండి చైతన్యం చాటాలని పిలుపునిచ్చారు. సోమవారం నాగార్జునసాగర్‌లోని హిల్ కాలనీలో నిర్వహించిన మాల మహానాడు ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తాళ్లపల్లి రవి మాట్లాడుతూ.. ప్రైవేట్రంగంలోనూ రిజర్వేషన్లు అమలుచేయాలని డిమాండ్‌చేశారు. ఎస్సీ,ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనార్టీలను కలుపుకుని త్వరలో రాజకీయ ఐక్యవేదికను ఏర్పాటుచేస్తామన్నారు.
సాగర్ లో నివాసం ఉంటున్న వారికి మాత్రమే ఇళ్లపట్టాలు వెంటనే ఇవ్వాలన్నారు. అనంతరం పట్టణ కమిటీని ఎన్నుకున్నారు. టౌన్ అధ్యక్షుడిగా బాబురావు, ఉపాధ్యక్షుడిగా ప్రకాశ్, కార్యదర్శిగా విజయ్, సహాయ కార్యదర్శులుగా అంబేద్కర్, భగవాన్, కోశాధికారిగా రవిని ఎన్నుకున్నారు. మావేశంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు మధు బాబు, సూర్య కోటేశ్వరరావు, మహిళా నాయకులు ధనమ్మ, స్వర్ణలత, యనమల సత్యం, జంగాల లక్ష్మి పాల్గొన్నారు.