సారథి న్యూస్, వెంకటాపూర్: పేదలకు సహాయం చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకురావాలని సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ పిలుపునిచ్చారు. పేదలకు సాయం చేయాలనే సదుద్దేశంతో హృదయ్(ఎన్జీవో) స్వచ్ఛంద సంస్థ సీఈవో షేక్ యాకూబ్ పాషా గూంజ్ సంస్థ సహకారంతో బుధవారం 220 కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు అందజేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ.. సమాజంలో చాలా మంది ఆకలితో ఆలమటిస్తూ ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. అలాంటి పేదలు ఎక్కడున్నా వారికి చేయూతనందించి దాతృత్వం చాటుకోవాలని తస్లీమా కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ శనిగరపు రమ, రమేష్, ఉపసర్పంచ్ ముద్దమల్ల కర్ణాకర్, స్వచ్ఛంద సంస్థ సభ్యులు, గ్రామస్తులు ఉన్నారు.
- February 24, 2021
- Archive
- లోకల్ న్యూస్
- వరంగల్
- షార్ట్ న్యూస్
- HRUDAY NGO
- TASLIMA MAHAMMAD
- VENKATPUR
- ములుగు
- వెంకటాపూర్
- హృదయ్ ఎన్జీవో
- Comments Off on పేదలకు సాయం చేద్దాం.. రండి