సారథి, చొప్పదండి: పట్టణ ప్రగతిలో భాగంగా చొప్పదండి పట్టణంలోని ఆరో వార్డు వడ్లూరి గంగరాజు ఆధ్వర్యంలో అభివృద్ధి కమిటీ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ప్రధానంగా నీటి సమస్య, కరెంటు, డ్రైనేజీలు, రోడ్లను శుభ్రం చేయకపోవడంతో అధ్వానంగా ఉందన్నారు. వీటి మీద వెంటనే చేపట్టాలని సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆరో వార్డు కౌన్సిలర్ వడ్లురి గంగరాజు మాట్లాడుతూ.. సీఎం కేఆర్ఆర్ ఆదేశాలనుసారం పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతి ఇంటికి ఆరు మొక్కలు పెంచాలని, తాజా కార్యక్రమం 10 రోజుల కార్యక్రమం ప్రతినెలా కొనసాగుతుందన్నారు. కమిటీ సభ్యులు కచ్చితంగా ప్రతి సమావేశానికి హాజరై సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. హరిత తెలంగాణ వైపు మనమంతా ప్రయాణం చేయాలని ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, గుర్రం శ్రీనివాస్ రెడ్డి, కోక్కుల శ్రీనివాస్, ధూంపేటి కొండయ్య, కట్ల శారద, అనుమాండ్ల శోభ, కొలపురి విజయ్ కుమార్, సోమిడి అభిషేక్, వడ్లూరి జానీ, వడ్లూరి శోభన్ బాబు, వడ్లూరి వెంకటస్వామి, కోడూరి నాగరాజు, ప్రత్యేక ఇంచార్జ్ గోపాల్, వాటర్ సప్లై అమర్, అంగన్వాడీ, కేంద్రం నిర్వహణరాలు దేవమని, మహమ్మద్ నాసర్, బుర్ర శ్రీకాంత్, గుర్రం సత్యనారాయణ రెడ్డి, అన్నడి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- June 28, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- city
- Press
- village development
- గ్రామాభివృద్ధిని
- చొప్పదండి
- పట్టణప్రగతి
- రాజన్నసిరిసిల్ల
- Comments Off on హరిత తెలంగాణ నిర్మిద్దాం