Breaking News

మీ అంతరంగిక వ్యవహారాలు గోప్యంగా ఉంచండి..

మీ అంతరంగిక వ్యవహారాలు గోప్యంగా ఉంచండి..

నేటి రాశిఫలాలు
26 ఏప్రిల్ 2021
సోమవారం

చైత్ర మాసం, ప్లవనామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంతఋతువు ,శుక్లపక్షం
సూర్యోదయం : 5:45, సూర్యాస్తమయం : 6:12
తిథి: చతుర్దశి ప. 12.07
రాహుకాలం: ఉదయం:7.30 నుంచి 9.00 గంటలు
యమగండము: ఉదయం 10.30 – మధ్యాహ్నం 12.00
వర్జ్యం: తెల్లవారుజామున: 4.44 లగాయితు
దుర్ముహుర్తం: పగలు.12.24 గంటలు, మధ్యాహ్నం 1.12, 2.46, 3.34 గంటలు

మేషం: ఉద్యోగస్తులకు తోటివారితో సత్సంబంధాలు నెలకొంటాయి. కళ, క్రీడారంగాల వారికి గుర్తింపు లభిస్తుంది. మీ అంతరంగిక వ్యవహారాలు గోప్యంగా ఉంచండి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. బంధుమిత్రుల నుంచి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. దూరప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. స్త్రీల మనోవాంఛలు నెరవేరగలవు. నూతన వ్యాపారాలు లీజు, ఏజెన్సీ, కాంట్రాక్టులకు సంబంధించిన వ్యవహారాల్లో విజయం పొందుతారు.

వృషభం: ఆర్థిక స్థితి కొంత ఫర్వాలేదనిపిస్తుంది. మెడికల్, న్యాయ విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. కుటుంబసభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. ఆర్థిక వ్యవహారాలు మరింత సంతృప్తి కలిగిస్తాయి. ఆప్తుల నుంచి ఆకస్మిక ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తిఉద్యోగాల్లో ఉత్సాహంగా సాగుతాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం. కోర్టు వ్యవహారాలు పరిష్కారమవుతాయి. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. ఉద్యోగస్తులకు ఆకస్మిక స్థానచలనం, కొత్త బాధ్యతలు వంటి ఫలితాలు ఉన్నాయి.

మిథునం: ఆర్థిక వ్యవహారాలు, నూతన వ్యాపారాల పట్ల శ్రద్ధవహిస్తారు. స్పెక్యులేషన్ కలిసిరాగలదు. రావలసిన మొండి బాకీలు వసూలవుతాయి. సేవాకార్యక్రమాలు నిర్వహించి ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలత పెరుగుతుంది. ఇంటిలో వివాహ విషయమై చర్చలు జరుగుతాయి. పాతమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. శుభకార్యాలకు యత్నాలు సాగిస్తారు. ఉద్యోగస్తులకు ఆకస్మిక స్థానచలనం, కొత్త బాధ్యతలు వంటి ఫలితాలున్నాయి. క్రయ, విక్రయాలు సామాన్యంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలకు అన్ని విధాలా కలిసివస్తుంది.

కర్కాటకం: విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగస్తుల శక్తి సామర్థ్యాలను అధికారులు గుర్తిస్తారు. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. వృథాఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టిపెడతారు. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాల్లో అదనపు పనిభారం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. ఆహార వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. ఏ వ్యవహారం కలిసి రాకపోవడంతో ఆందోళన చెందుతారు. ఒక ఖర్చు నిమిత్తం తెచ్చిన ధనం మరొక అవసరానికి వినియోగించవలసి వస్తుంది.

సింహం: వృత్తుల వారికి శ్రమాధిక్యత మినహా ఆదాయం అంతంతమాత్రంగానే ఉంటుంది. దూరప్రాంత బంధు మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. సమాజంలో ప్రముఖుల పరిచయాలతో కీలకమైన పనులు పూర్తిచేస్తారు. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. వృత్తి ఉద్యోగాల్లో పురోగతి కలుగుతుంది. మీ సంతానం విద్యావిషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. స్త్రీలకు అలంకారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. క్రయ విక్రయాలు లాభదాయకంగా సాగుతాయి. ప్రముఖుల కలయిక వల్ల ఏమంత ప్రయోజనం ఉండదు.

కన్య: సోదరులతో భూ సంబంధిత వివాదాలు ఉంటాయి. భాగస్వామిక సొంత వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదావేస్తారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగంలో బాధ్యతలు నిర్వహించడంలో లోటుపాట్లు ఉంటాయి. ధన వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. నేత్రసంబంధిత సమస్యలు కలుగుతాయి. వస్త్రప్రాప్తి, వాహన యోగం వంటి శుభ సంకేతాలు ఉన్నాయి. అవివాహితులకు కోరుకున్న సంబంధాలు నిశ్చయం కాగలవు.

తుల: వృత్తి ఉద్యోగాల్లో ఇతరులతో వివాదాలు కలుగుతాయి. ఆర్థిక లావాదేవీలు, మధ్యవర్తిత్వాలు సమర్థంగా నిర్వహిస్తారు. దాంపత్యసుఖం, అధిక శ్రమతో అల్పఫలితం పొందుతారు. మాతృ సంబంధీకులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపార నష్ట సూచనలు ఉన్నాయి. దూరప్రయాణాల్లో మార్గ అవరోధాలు ఉంటాయి. మిత్రులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. వాహన యోగం వంటి శుభ ఫలితాలు ఉన్నాయి. పండ్లతోటల రంగాల వారికి నిరుత్సాహం తప్పదు. దైవదర్శనాలు చేస్తారు. మీ మాటకు ఇంటాబయట ఆదరణ లభిస్తుంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు ఆందోళన కలిగిస్తాయి.

వృశ్చికం: ఉద్యోగస్తులకు ప్రమోషన్, నగదు, అవార్డు, ఇంక్రిమెంట్ వంటి శుభపరిణామాలు ఉంటాయి. ఉద్యోగంలో పనిఒత్తిడి నుంచి బయటపడతారు. బంధుమిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. చేపట్టిన పనులను వేగంగా పూర్తిచేస్తారు. నూతన వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఖర్చులు కుటుంబ అవసరాలు పెరుగుతాయి. ఇంటిలో శుభకార్యం చేపడతారు. విద్యార్థుల అత్యుత్సాహం విపరీతాలకు దారితీసే ఆస్కారం ఉంది. ఏజెంట్లు, బ్రోకర్లకు ఒత్తిడి, చికాకులు తప్పవు. బంధువులను కలుసుకుంటారు.

ధనుస్సు: ఆర్థిక విషయాల్లో ఆలోచనలను ఆచరణలో పెడతారు. ఉద్యోగస్తులు సమర్థవంతంగా పనిచేసి పై అధికారులను మెప్పిస్తారు. ప్రేమికుల అతి చొరవ, సాహసం ఇబ్బందులకు దారితీస్తాయి. బ్యాంకు వ్యవహారాల్లో జాగ్రత్తలు అవసరం. ఉద్యోగులు ప్రమోషన్లు అందుకుంటారు. చాలాకాలంగా వేధిస్తున్న స్థిరాస్తి వివాదాల తొలగిపోతాయి. వ్యాపారపరంగా పెద్దల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులకు ఎంత జాగ్రత్తగా వ్యవహరించినా ఏదో ఒక పొరపాటు జరిగే ఆస్కారం ఉంది. రావలసిన ధనంలో కొంతమేరకు వసూలు కాగలవు.

మకరం: స్త్రీలకు గృహోపకరణాలు, గృహాలంకరణ పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రముఖ కంపెనీల షేర్ల విలువలు గణనీయంగా పెరిగే ఆస్కారం ఉంది. కుటుంబ సంబంధిత బాధ్యతలు మానసికంగా చికాకు కలిగిస్తాయి. ఆరోగ్య విషయాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కొత్త రుణ ప్రయత్నాలు చేస్తారు. కీలక విషయాల్లో ఆలోచనల స్థిరత్వం లోపిస్తుంది. స్థిరచరాస్తులు క్రయవిక్రయాలకు అనుకూలంగా మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును గాయపరుస్తాయి. ఆపద సమయంలో మిత్రులు ఉండగా నిలుస్తారు.

కుంభం: కోర్టు వ్యవహారాల్లో ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఇంటాబయట ప్రతికూల వాతావరణం ఉంటుంది. కొన్ని వ్యవహారాల్లో ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో పై అధికారులతో సమస్యలు కలుగుతాయి. వాహనం విలువైన వస్తువులు, ఆభరణాలు సమకూర్చుకుంటారు. స్త్రీలు ఆహ్వానాలు అందుకుంటారు. ఖర్చులు పెరగడంతో రుణ యత్నాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి.

మీనం: ఆర్థిక కుటుంబ సమస్యలు చక్కబడతాయి. సేవ, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులలో నూతనోత్సాహం నెలకొంటుంది. ఇంటిలో దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. దీర్ఘ కాలిక రుణాలను తీర్చగలుగుతారు. అవివాహితులు శుభవార్త వింటారు. కొన్ని అవకాశాలు అప్రయత్నంగా కలిసివస్తాయి. బంధుమిత్రులతో సఖ్యత నెలకొంటుంది. వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది.

:: బ్రహ్మశ్రీ విప్పర్ల మహేశ్ విశ్వకర్మ గురూజీ,
ప్రముఖ జ్యోతిష్య పండితులు,
సెల్​నం.95020 59649