సారథి న్యూస్, పెద్దశంకరంపేట: కళ్యాణలక్ష్మి పథకం పేదింటి ఆడపిల్లలకు వరం లాంటిదని నారాయణఖేడ్ ఎమ్మెల్యే ఎం.భూపాల్ రెడ్డి అన్నారు. బుధవారం పెద్దశంకరంపేటలో 84 మంది లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణలక్ష్మి చెక్కులను బుధవారం ఆయన అందజేశారు. సీఎం కేసీఆర్కళ్యాణలక్ష్మి పథకం ద్వారా రూ.1.16లక్షలు అందజేస్తున్నారని తెలిపారు. గురుకులాల్లో ఒక్కో విద్యార్థినిపై లక్షలు ఖర్చు చేస్తున్నారని వివరించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ప్రతిఒక్కరూ ఆర్థికంగా ఎదగాలని కోరారు. కార్యక్రమంలో మెదక్ డీపీవో తరుణ్ కుమార్, రైతుబంధు సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, పేట ఎంపీపీ జంగం శ్రీనివాస్, జడ్పీటీసీ విజయరామరాజు, వైస్ ఎంపీపీ లక్ష్మి రమేష్, రైతుబంధు మండలాధ్యక్షుడు సురేష్ గౌడ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు దత్తు, రామాయంపేట తహసీల్దార్ ప్రేమ్ కుమార్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
సూపర్