సారథి, అచ్చంపేట: ప్రజాసమస్యలను వెలుగులోకి తెస్తున్న తొలి వెలుగు ఛానల్ రిపోర్టర్, యాంకర్ రఘును పోలీసులు గురువారం ఉదయం మల్కాజిగిరిలో కిడ్నాప్ చేసిన ఘటనను టీయూడబ్ల్యూజే (ఐజేయూ) తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా జిల్లా నాయకులు దశరథం నాయక్ మాట్లాడుతూ.. ప్రజలు సమస్యలు, భూకబ్జాలను వెలుగులోకి తీసుకొస్తున్న రఘును అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి గుర్రంపోడు గిరిజన భూముల ఆక్రమణలపై రాజ్ న్యూస్ రిపోర్టర్ గా కథనాలు అందించాడని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ధర్నాను ఆయన కవరేజీ చేశాడని గుర్తుచేశాడు. మీడియా గొంతు నొక్కేందుకే రఘును పోలీసులు అరెస్ట్ చేశారని అన్నారు. వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
- June 4, 2021
- Archive
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- gurrampodu
- journalist raghu
- tolivelugu
- గుర్రంపోడు
- జర్నలిస్టు రఘు
- తొలి వెలుగు
- పోడుభూములు
- Comments Off on జర్నలిస్టు రఘును విడుదల చేయాలి