సారథి న్యూస్, వాజేడు, వెంకటాపురం: ఏజెన్సీ ప్రాంత సమస్యల పరిష్కారానికి మార్చి 1న ఐటీడీఏ ముట్టడి కార్యక్రమాన్నినిర్వహిస్తున్నట్లు ఆదివాసీ సంక్షేమ పరిషత్ వాజేడు మండలాధ్యక్షుడు టింగ బుచ్చయ్య, జిల్లా అధ్యక్షుడు కొర్నిబెళ్లి నాగేశ్వరరావు, ఏవీఎస్ పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూప నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం వాల్పోస్టర్లు విడుదల చేశారు. ఆదివాసీల సమస్యలను పట్టించుకోని అధికారులకు బుద్ధి చెప్పే రోజు వచ్చిందన్నారు. అలాగే ఏజెన్సీ ఏరియాలో 1/59,1/70 చట్టాలకు విరుద్ధంగా గిరిజనేతరులు అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. ఎలాంటి హక్కు లేని గిరిజనేతరులు భారీ కట్టడాలు కడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు. సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇప్పించాలన్నారు. కార్యక్రమంలో భద్రాచలం డివిజన్ అధ్యక్షుడు సొందే మల్లుదొర, వాజేడు మండల ప్రధాన కార్యదర్శి పొడెం సురేష్, ఏఎస్పీ జిల్లా నాయకులు చింతా మోహన్, రేగ గణేష్, ఫూనెం చంటి, బొదేబోయిన సురేష్ తదితరులు పాల్గొన్నారు.
- February 26, 2021
- Archive
- లోకల్ న్యూస్
- వరంగల్
- షార్ట్ న్యూస్
- ADIVAASI
- ITDA MULUGU
- ఆదివాసీలు
- ఏజెన్సీ ప్రాంతం
- ఐటీడీఏ
- Comments Off on మార్చి 1న ఐటీడీఏ ముట్టడి