Breaking News

దళిత రిపోర్టర్ రాజశేఖర్ పై అక్రమ కేసులు సరికాదు

దళిత రిపోర్టర్ రాజశేఖర్ పై అక్రమకేసులు సరికాదు

సారథి, కొల్లాపూర్: పట్టణంలోని దళిత రిపోర్టర్ రాజశేఖర్ పై అక్రమ కేసు పెట్టి చిత్రహింసలకు గురిచేసిన పోలీసులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఎస్పీకి మాలల చైతన్య సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు మూలే కేశవులు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు మద్దెల రామదాసులు గురువారం వేర్వేరు వినతిపత్రాలను అందజేశారు. సాయికృప హాస్పిటల్ డాక్టర్ కొండ శీను, విక్రమ్ గౌడ్ ఫిర్యాదు మేరకు రాజశేఖర్ పై కేసు నమోదు చేసి ఎస్సై బాలవెంకటరమణ, కానిస్టేబుళ్లు రవి కుమార్, శివకుమార్, రైటర్ శ్రీను కలిసి చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు. వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, డాక్టర్ కొండ శ్రీనివాసులు, విక్రం గౌడ్, లక్కీ డ్రా స్కీంలు నిర్వహిస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని వారు వినతిపత్రాల్లో కోరారు. లేనిపక్షంలో తామ దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు మాచుపల్లి రాంచందర్, సంకె వెంకటస్వామి, పత్తి యాదయ్య పాల్గొన్నారు.