సారథి, బుగ్గారం(జగిత్యాల): జగిత్యాల జిల్లా నూతన మండల కేంద్రమైన బుగ్గారం గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపి ప్రజాధనాన్ని కాపాడాలని గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్, తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షుడు చుక్క గంగారెడ్డి కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. బుగ్గారం గ్రామ పంచాయతీలో సుమారు రూ.30లక్షల నిధులు దుర్వినియోగమైనట్లు ఆయన ఆరోపించారు. ఇదంతా అధికారులకు తెలిసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ కేవలం రూ.16,14,585కు మాత్రమే షోకాజ్ నోటీసులు జారీచేశారని అన్నారు. ఏడు నెలలు గడుస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం లేదన్నారు. నిధుల దుర్వినియోగాన్ని ప్రోత్సహిస్తూ, దొంగ రికార్డులు, దొంగ బిల్లుల తయారీకి అవకాశమిస్తున్న జిల్లా పంచాయతీ అధికారి నరేష్, పాత డీపీవో వేముల శేఖర్, డివిజనల్ పంచాయతీ అధికారి ప్రభాకర్ తో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చుక్క గంగారెడ్డి జిల్లా కలెక్టర్ ను కోరారు.
- June 15, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- buggaram
- JAGITYALA
- జగిత్యాల
- తెలంగాణ జనసమితి
- బుగ్గారం
- Comments Off on నిధుల దుర్వినియోగంపై విచారణ జరపండి