Breaking News

బంధాల కన్నా ఆత్మీయత గొప్పది

  • March 20, 2021
  • Archive
  • Comments Off on బంధాల కన్నా ఆత్మీయత గొప్పది
బంధాల కన్నా ఆత్మీయత గొప్పది

సారథి న్యూస్, ములుగు: కాలానికి అనుగుణంగా మనుషుల్లో ఎలాంటి తారతమ్యం లేకుండా స్వేచ్ఛ, సమానత్వం కలిగి ఉండాలని సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ అన్నారు. గురువారం ములుగు లిటిల్ ఫ్లవర్ పాఠశాల ఆవరణలో వర్డ్ సంస్థ ఆధ్వర్యంలో వికాస బాల, బాలికలకు సానుభూతి (జన్మదిన) వేడుకలు నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా విచ్చేసిన తస్లీమా మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో కొందరు అందరు ఉన్నా అనాథలుగా మిగిలిపోతున్నారని, ఇలాంటి తరుణంలో బంధాలు, బంధుత్వాల కన్న ఆత్మీయత, అభిమానం, సమానత్వం ఉండాలని ఆమె సూచించారు. వీరి కోసం వర్డ్ సంస్థ ముందుకు రావడం అభినందనీయమన్నారు. నేటి పోటీ ప్రపంచంలో రాణించాలంటే చిన్నప్పటి నుంచే లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు. పట్టుదలతో చదివి, ఉన్నతంగా ఎదగాలని తస్లీమా ఆకాంక్షించారు. కార్యక్రమంలో వర్డ్ సంస్థ డైరెక్టర్ సోలి సిస్టర్, ఎల్ఐసీ ఆఫీసర్ సంపత్, కాసుల రవి కుమార్, మాధవిలత, తార సిస్టర్, ప్రిన్సిపల్​ జ్యోతి సిస్టర్, కాన్వెంట్ సిస్టర్స్, వర్డ్ సంస్థ సభ్యులు తదితరులు ఉన్నారు.