సారథి, రాయికల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అత్యాధునిక సమీకృత మార్కెట్, శ్మశానవాటిక నిర్మాణాలకు సంబంధించిన స్థలాన్ని కరీంనగర్ జిల్లా రాయికల్ పట్టణంలో శనివారం ఏఈ అజయ్ పరిశీలించారు. ఇటీవల ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కు రూ.రెండుకోట్లు, శ్మశానవాటిక కు రూ.కోటి నిధులు మంజూరయ్యాయి. నిర్మాణం కోసం పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్తరఫున స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మోర హనుమాండ్లు మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా పనులు మొదలుపెట్టి త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. వారి వెంట కమిషనర్ దుర్గం శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ యువ నాయకులు మోర రామ్మూర్తి, ఎలిగేటి అనిల్ కుమార్ ఉన్నారు.
- May 2, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- INTEGRATED MARKET
- raykal
- ఇంటిగ్రేటెడ్ మార్కెట్
- కరీంనగర్
- రాయికల్
- Comments Off on ఇంటిగ్రేటెడ్ మార్కెట్, శ్మశానవాటికకు స్థలపరిశీలన