సారథి, నాగర్‌కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో జీవీకే 108 అంబులెన్స్ లు, 102 అమ్మఒడి వాహనాలను ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ కోరట్ల వెంకటేశ్వర్లు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంబులెన్స్ లోని వైద్యపరికరాల పనితీరును పరిశీలించారు. వాహనంలో నిత్యం ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు. కరోనా పేషెంట్లను తరలించే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రోగిని తరలించిన వెంటనే శానిటైజేషన్చేయాలని ఆదేశించారు. అమ్మఒడి వాహనాల ద్వారా కొవిడ్ నిబంధనలను పాటిస్తూ గర్భిణులను సురక్షితంగా ఆస్పత్రులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని నాగర్‌కర్నూల్ జిల్లా కోఆర్డినేటర్ రత్నమయ్య సూచించారు. వారి వెంట ఈఎంటీ రవి, పైలెట్ శ్రీనివాసులు, నాగరాజు పాల్గొన్నారు.
- July 7, 2021
- Archive
- మహబూబ్‌నగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- nagarkurnol
- కరోనా
- జీవీకే అంబులెన్స్‌లు
- నాగర్‌కర్నూల్
- Comments Off on 108,102 వాహనాల తనిఖీ