Breaking News

పీవీ కూతురైతే ఓటేయాలా..?

పీవీ కూతురైతే ఓటేయాలా..?

సారథి న్యూస్, మహబూబ్​నగర్: ఏ అర్హత ఉందని మీకు గ్రాడ్యుయేట్లు ఓట్లు వేయాలని హైదరాబాద్, మహబూబ్​నగర్, రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి ముకురాల శ్రీహరి టీఆర్ఎస్ ​అభ్యర్థి సురభి వాణీదేవిని ఉద్ధేశించి విమర్శించారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహరావు కూతురుగా అర్హత ఉంటే సరిపోతుందా? అని ప్రశ్నించారు. మంగళవారం మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో గిరిజన విద్యార్థి వేదిక, బహుజన స్టూడెంట్​యూనియన్​ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఎందుకు వేయడం లేదని అడిగే నిరుద్యోగులకు ఏం చెబుతారని ప్రశ్నించారు. పీఆర్సీ, ఐఆర్ ​ఎందుకు ఇవ్వడం లేదో ఉపాధ్యాయ, ఉద్యోగులకు సమాధానం చెప్పాలని డిమాండ్ ​చేశారు. రెండుసార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన ప్రొఫెసర్ నాగేశ్వర్​కు పదవీదాహం తీరలేదా? అని ప్రశ్నించారు. సిట్టింగ్​ ఎమ్మెల్సీ రామచంద్రరావు నిరుద్యోగుల సమస్యలపై ఏనాడూ పల్లెత్తు మాట మాట్లాడ లేదని ధ్వజమెత్తారు. పెట్రోల్, డీజిల్​ధరలు ప్రజల జీవనంపై తీవ్రప్రభావం చూపుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నంచడం లేదన్నారు. బీజేపీ ప్రభుత్వానికి బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ నాశనం కావడానికి మాజీమంత్రి జి.చిన్నారెడ్డి వారే కారణమని విమర్శించారు. నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు తనను గెలిపిస్తే మండలిలో ప్రజాగొంతుకగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని అన్నారు. కార్యక్రమంలో నాయకులు గోపాల్​రాథోడ్, శ్రీరాములు, అబ్బాస్​పాల్గొన్నారు.