సారథి న్యూస్, పెద్దశంకరంపేట: విధి నిర్వహణలో ప్రజలకు చేసిన సేవలే గుర్తింపునిస్తాయని సంగారెడ్డి తపాలా శాఖ సబ్ డివిజన్ మెయిల్ ఓవర్సీ స్ బి.శ్రీనివాస్, పెద్దశంకరంపేట ఎస్పీఎం అనిల్కుమార్అన్నారు. శనివారం పెద్దశంకరంపేట పోస్ట్‌ఆఫీసులో చిలపల్లి బీపీఎం సుదర్శన్ రిటైర్డ్మెంట్కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. 42 ఏళ్ల పాటు గ్రామీణ ప్రాంతాల్లో తపాలాశాఖలో సేవలందించడం అమోఘమన్నారు. అనంతరం బీపీఎం సుదర్శన్‌ను తపాలా సిబ్బంది ఘనంగా సన్మానించింది. కార్యక్రమంలో గంగారాం విజయ్ కుమార్, సాయిరాం, కృష్ణవేణి, రాఘవేందర్, నిరంజన్, శంకర్, సాయిగౌడ్ పాల్గొన్నారు.
- January 30, 2021
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- BPM
- PEDDASHANKARAMPET
- POSTAL DEPARTMENT
- తపాలా శాఖ
- పెద్దశంకరంపేట
- బీపీఎం
- Comments Off on సేవలతోనే గుర్తింపు