Breaking News

నేనున్నానని.. దిగులేవద్దని!

నేనున్నానని.. దిగులేవద్దని!
  • పలువురికి ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి భరోసా

సామాజిక సారథి, రామాయంపేట: మెదక్​ జిల్లా నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి బుధవారం పర్యటించారు. ఇటీవల మరణించిన పిట్ల సత్యం ఇంటికి రూ.1.5 లక్షల వ్యయంతో నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ మరమ్మతు చేయించారు. ఎమ్మెల్సీ సందర్శించి అతని కుటుంబసభ్యులను పరామర్శించారు. సత్యం పిల్లల ఉన్నత చదువుల పూర్తి బాధ్యతను తాను తీసుకుంటున్నానని ప్రకటించారు. వారికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే వరకు ట్రైనింగ్ ఖర్చులు కూడా చెల్లిస్తానని హామీ ఇచ్చారు. అలాగే ఇటీవల మరణించిన దొంతురబోయిన బాబు కుటుంబాన్ని పరామర్శించి రూ.10వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఇటీవల మరణించిన మెట్టు అమృత కుటుంబాన్ని పరామర్శించి రూ.10వేల ఆర్థిక సహాయం చేశారు. వారి వెంట చల్మేడ సర్పంచ్ నరసింహరెడ్డి, ఉపసర్పంచ్ తుమ్మల రమేష్, నార్లాపూర్ సర్పంచ్ రాజిరెడ్డి, టీఆర్ ఎస్ నాయకులు జీపీ స్వామి, రాములు, లింగం, దుర్గాభవాని యూత్ సభ్యులు స్వామి, నరేష్, నాని, నాగరాజు, స్వామి, నవీన్, నవీన్, అరుణ్, శివకుమార్, మారుతి, భాను, శ్రీకాంత్, రాజు, విజయ్, రంజిత్, పిట్ల నర్సింలు, గుమ్ముల నరేష్ ఉన్నారు.