సారథి న్యూస్, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఫేస్ బుక్ అకౌంట్ ను సైబర్ నేరస్తులు హ్యాక్ చేశారని ఎస్సై ఎస్.శ్రీధర్ సోమవారం విలేకరులకు తెలిపారు. వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పలు అసత్యపు ప్రచారాలు, నేరాలను అదుపు చేసేందుకు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఫేస్ బుక్ అకౌంట్ తెరిచామన్నారు. గుర్తుతెలియని సైబర్ నేరస్తులు హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఫేస్ బుక్ ను హ్యాక్‌చేసి, డూప్లికేట్ ఫేస్ బుక్ పేజీని తయారుచేయడమే కాకుండా అందులో హుస్నాబాద్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న తన ఫొటో పెట్టారన్నారు. సైబర్ నేరగాళ్లు ఇంతటితో ఆగకుండా డబ్బులు అవసరం ఉన్నాయని, గూగుల్ పే, ఫోన్ పే ద్వారా డబ్బులు పంపించమని ఫేస్‌బుక్‌ద్వారా మెసేజ్ లు పంపిస్తున్నారని వివరించారు. ప్రజలు, తనకు తెలిసిన స్నేహితులు ఎవరు కూడా అలాంటి మెసేజ్ లకు స్పందించి, డబ్బు పంపించి మోసపోకూడదని ఎస్సై ఎస్.శ్రీధర్ కోరారు.
- February 1, 2021
- Archive
- క్రైమ్
- షార్ట్ న్యూస్
- HUSNABAD
- SYBERCRIME
- ఎస్సై శ్రీధర్
- ఫేస్బుక్
- సైబర్ నేరస్తులు
- హుస్నాబాద్
- Comments Off on హుస్నాబాద్ పీఎస్ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్