సారథి న్యూస్, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి వేళల్లో హల్ చల్ సృష్టిస్తున్నారు. పొరుగు రాష్ట్రంలో మద్యం దొరక్కపోవడంతో మందుబాబులు సరిహద్దు ప్రాంతమైన పుల్లూరు గ్రామంలో నిత్యం తిరుగుతున్నారు. బయట రోడ్లపై కనిపించిన వారిని బెదిరింపులకు గురిచేస్తూ డబ్బులు, బంగారు నగలు, విలువైన వస్తువులను లాక్కెళ్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి 9 గంటలకు పుల్లూరు గ్రామానికి చెందిన విశ్వనాథ్ అనే యువకుడు తన ఆఫీస్ కాల్ మాట్లాడుతూ రోడ్డుపై తిరుగుతుండగా కొందరు ముళ్లపొదల్లోకి లాక్కెళ్లారు. అతనిపై పిడిగుద్దులు గుప్పిస్తూ రూ.పదివేల నగదు, విలువైన ఫోన్ ను లాక్కెళ్లారు. ఇలా రోజుకొక సంఘటన జరుగుతుండడంతో పుల్లూరు గ్రామస్తులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- February 2, 2021
- Archive
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- ANDRAPADESH
- PULLURU
- TELANGANA BOARDER
- ఆంధ్రప్రదేశ్
- ఉండవెల్లి
- గద్వాల
- పుల్లూరు
- మద్యం అమ్మకాలు
- Comments Off on రాత్రివేళ దుండగుల హల్ చల్