సారథి, చొప్పదండి: లయన్స్ క్లబ్ ఆఫ్ చొప్పదండి ఆధ్వర్యంలో గురువారం డాక్టర్స్ డే సందర్భంగా చొప్పదండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 8 మంది డాక్టర్లను సన్మానించారు. అనంతరం ఆస్పత్రిలోని 20మంది రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అలాగే పోస్టల్ వర్కర్స్ డే సందర్భంగా చొప్పదండి పోస్ట్ ఆఫీసులోని ముగ్గురు పోస్టల్ వర్కర్లను సత్కరించారు. అనంతరం కరీంనగర్ లోని చార్టర్ అకౌంటెంట్ నాగేశ్వర శర్మ, పావని కిశోర్ ను చార్టర్ అకౌంటెంట్ డే సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఆయా కార్యక్రమాల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ చొప్పదండి అధ్యక్షుడు నలుమాచు సుధాకర్, కార్యదర్శి మామిడి రాజేష్ పవార్, కోశాధికారి వల్లాల జగన్, జోన్ చైర్ పర్సన్ కొల్లూరి జితేందర్, జిల్లా ముఖ్య సమన్వయకర్త కొల్లూరి ఆనందం, జిల్లా సమన్వయ కర్తలు వల్లాల కృష్ణహరి, పెద్ది లక్ష్మీకాంతం, సభ్యులు సామల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
- July 2, 2021
- Archive
- CHOPPADANDI
- lions club
- postal workers day
- చొప్పదండి
- డాక్టర్స్డే
- పోస్టల్ వర్కర్స్ డే
- లయన్స్ క్లబ్ ఆఫ్
- Comments Off on డాక్టర్లు, పోస్టల్ సిబ్బందికి ఘనసన్మానం