Breaking News

ఆరోగ్య తెలంగాణ.. సీఎం సంకల్పం

ఆరోగ్య తెలంగాణ.. సీఎం సంకల్పం

  • డయేరియా ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి
  • మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

సారథి, రామాయంపేట: మొక్కలను పెంచి హరిత తెలంగాణను నిర్మించి ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్​ ఎంతో కృషిచేస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి కొనియాడారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం నిరంతర ప్రక్రియ అయినప్పటికీ ఈ 10రోజులు స్పెషల్ డ్రైవ్ చేస్తున్నామని తెలిపారు. ఆదివారం ఆమె నిజాంపేట మండల కేంద్రంలో పల్లెప్రగతిలో కార్యక్రమంలో భాగంగా మొక్కను నాటి నీళ్లుపోశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డంపింగ్​ యార్డ్ నిర్మించి చెత్తను సేకరించి పల్లెలు, పట్టణాలు పరిశుభ్రంగా ఉండాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఉన్నారని ఆమె పేర్కొన్నారు. వర్షాకాలంలో డయేరియా ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. అనంతరం ఓ ప్రైవేట్​ఫంక్షన్ హాల్ ను ఆమె ప్రారంభించారు. పేదలు కూడా శుభకార్యాలు చేసుకునేలా అందుబాటు రేట్లు ఉండాలని సంబంధిత ఓనర్ కు సూచించారు. కార్యక్రమంలో నిజాంపేట జడ్పీటీసీ సభ్యుడు పంజా విజయ్ కుమార్, ఎంపీపీ సిద్ధరాములు, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ భాస్కర్ రావు, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, టీఆర్​ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఫంక్షన్​హాల్​ను ప్రారంభిస్తున్న మెదక్​ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి