Breaking News

హెడ్ కానిస్టేబుల్ గొప్ప హృదయం

హెడ్ కానిస్టేబుల్ గొప్ప హృదయం

సామాజికసారథి, వెల్దండ: హెడ్ కానిస్టేబుల్ గొప్ప హృదయం చాటుకున్నారు. వైద్యవిద్యార్థినికి కొండంత సాయం అందించారు. ప్రజల రక్షణంలోనే కాదు.. సామాజిక సేవలోనూ ముందుంటామని నిరూపించారు. ఇటీవల వెల్లడించిన నీట్ ఫలితాల్లో ఎంబీబీఎస్ సీటు సంపాదించిన వెల్దండ మండల కేంద్రానికి చెందిన ఆటోడ్రైవర్ ఫ్రాంక్లిన్, అలివేలు దంపతుల కూతురు సృజన వైద్యచదువులకు చేయూతను అందించారు. నాగర్​కర్నూల్ ​జిల్లా వెల్దండ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ శేఖర్ సోమవారం తనవంతు సహాయంగా ఎస్సై నర్సింహులుతో కలిసి సదరు విద్యార్థిని తల్లిదండ్రులకు రూ.10వేల నగదు సాయం అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్సై కుమారస్వామి, వెల్దండ ఉపసర్పంచ్​ జంగిలి నిరంజన్, పోలీస్​ సిబ్బంది శంకర్ రెడ్డి, శివాజీ, బాలకిష్టయ్యగౌడ్, వెంకటేశ్, చంద్రశేఖర్, అమర్ సింగ్, కృపానందం, జి.రాజు తదితరులు పాల్గొన్నారు.