Breaking News

నన్ను చంపాలని చూశాడు.. చర్యలు తీసుకోండి

నన్ను చంపాలని చూశాడు.. చర్యలు తీసుకోండి


నాగర్​కర్నూల్​ పోలీసులకు ఓ యువకుడికి ఫిర్యాదు


సామాజికసారథి, నాగర్​కర్నూల్​: తనపై అకారణంగా దాడిచేసి హత్యాయత్నం చేసి తీవ్రంగా గాయపరిచిన వారిపై చర్యలు తీసుకోవాలని ఓ యువకుడు మంగళవారం నాగర్​ కర్నూల్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి కథనం మేరకు వివరాలు.. నాగర్​కర్నూల్​ సంజయ్​నగర్​ కాలనీకి చెందిన జాజుల రాజ్​కుమార్​ అనే యువకుడు స్థానిక ఆనంద నిలయం హాస్టల్​ వద్ద నిలిచి ఉన్నాడు. అక్కడికి కార్తీక్​ అనే వ్యక్తి కారులో (టీఎస్​ 31 ఎఫ్​0011) వచ్చాడు. ఇదిలాఉండగా, కార్తీక్​ తమ్ముడు కౌశిక్​గౌడ్​ రెండు రోజుల క్రితం గొడవపడి వికాస్​ అనే యువకుడిని కొట్టాడు. ఇదే విషయమై వికాస్​ను మీ తమ్ముడు ఎందుకు కొట్టాడని రాజ్​కుమార్​ కార్తీక్​ను నిలదీశాడు. ‘మీరెవర్రా మమ్మల్ని అడగటానికి’ అని పక్కనే రాయితో కార్తీక్..​ రాజ్​కుమార్​ తలపై బాదాడు. ఇంతలో కారులో ఉన్న కత్తిని తీశాడు. ఏం జరిగిందోనని సమీపంలో ఉన్న రాజ్​కుమార్ స్నేహితులు అక్కడికి రాగా, కార్తీక్​ కారును, కత్తిని అక్కడే వదిలేసి పారిపోయాడు. తీవ్రంగా రక్తమోడుతున్న రాజ్​కుమార్​ నాగర్​కర్నూల్​ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. తనపై హత్యాయత్యానికి దిగిన కార్తీక్​ పై చర్యలు తీసుకోవాలని కోరాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

నిందితుడు కార్తీక్​