సారథి, అచ్చంపేట: అధికారుల వేధింపుల కారణంగానే ఆర్టీసీ రాణిగంజ్ డిపో–1 డ్రైవర్ తిరుపతి ఆత్మహత్యకు పాల్పడ్డాడని, అతని కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్చేస్తూ నాగర్కర్నూల్జిల్లా అచ్చంపేట ఆర్టీసీ డిపో ఎదుట యూనియన్ నాయకులు, ఉద్యోగులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా యూనియన్నాయకుడు ప్రభాకర్ మాట్లాడుతూ.. అధికారుల వేధింపులతో తిరుపతిరెడ్డి ఆత్మహత్య చేసుకోవడం విచారకరమన్నారు. వేధింపులకు పాల్పడిన అధికారులపైనా తగిన చర్య తీసుకోవాలని, వారిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి రూ.30 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. చిన్న చిన్న కారణాలు చూపించి యాజమాన్యం వేధింపులకు పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఐదు నిమిషాలు లేటైనా డ్యూటీ ఇవ్వకుండా రోజుల తరబడి తిరిగేలా అప్సెంట్ వేసి జీతాల్లో కోత విధిస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో ఆర్టీసీ నాయకులు ఎస్.వెంకటయ్య, బాలాజీ, జైగోపాల్, లలిత, ఆంజనేయులు, బాలయ్య పాల్గొన్నారు.
- June 30, 2021
- Archive
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- ranigunj depot
- rtc driver suicide
- ఆర్టీసీ
- రాణిగంజ్ డిపో
- Comments Off on ఆర్టీసీ కార్మికులపై వేధింపులు ఆపాలి