Breaking News

సంతోషాల దీపావళి..

సంతోషాల దీపావళి

సామాజిక సారథి, నెట్​వర్క్: ఇంటింటా దీపావళి వేడుకలు అంబరాన్నంటాయి. గుమ్మాల ముందు వెలిగించిన దీపాలు కొత్త శోభను తెచ్చిపెట్టాయి. పటాకుల ఢాం.. ఢాం చప్పుడు ఊరూవాడంతా, పల్లెపట్టణమంతా దద్దరిల్లింది. వెరసి దీపావళి సంబరాలు సంతోషం నింపాయి. దీపం వెలిగించిన చోట ఆరోగ్యం, ధనసంపదలు, శుభాలు, బుద్ధిప్రకాశం విరాజిల్లుతాయి. శుభకార్యాల్లో దీపం వెలిగిస్తే విజయాలు కలుగుతాయని, అది విజయ సంకేతమని పురాణాలు చెబుతుంటారు. ప్రతి పనిని ప్రారంభించే ముందు దీపాన్ని వెలిగించి పూజ చేయడం ఆచారంగా వస్తోంది. లక్ష్మీదేవి జన్మదినోత్సవంగా భావించి పూజించడం ద్వారా విశేషఫలితం ఉంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఉదయమే ఇళ్లను అలంకరించుకుని లక్ష్మీదేవికి ప్రత్యేకపూజలు చేశారు. నోములు, వ్రతాలు ఆచరించారు.

చిచ్చుబుడ్డిని వెలిగిస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు
పెద్దశంకరంపేటలో చిన్నారుల దీపావళి సంబరాలు
చిన్నారుల మోములో దీపావళి కాంతులు..
మహబూబాబాద్ ఎంపీ మాలోత్​ కవిత ఇంటిలో దీపావళి సంబరాలు
సంగారెడ్డిలో లక్ష్మీపూజలు
మందమర్రిలో టాపాసులు కాల్చుతున్న మహిళలు
మందమర్రిలో దీపావళి వేళ చిన్నారుల కోలాహలం
షాబాద్ లో లక్ష్మీపూజ చేస్తున్న మహిళలు
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో దీపావళి వేడుకలు