సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో ఆవరణలో సీనియర్ మహిళలు, జూనియర్ బాలుర సెలెక్షన్స్ మంగళవారం నిర్వహించారు. ఈ పోటీల్లో సుమారు 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఎంపికైనవారికి ఈనెల 6 నుంచి 8వ తేదీ వరకు వరంగల్ లో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శలు వీర్ల వెంకటేశ్వరరావు, బసరవేని లక్ష్మణ్ ముదిరాజ్ తెలిపారు. కోరుట్ల, మంథని గుళ్లకోట, సిరిసిల్ల తదితర ప్రాంతాల నుంచి క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పంజాల ప్రమీల, సీనియర్ క్రీడాకారులు ప్రభాకర్, శ్రీను, అశోక్, మూల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
- March 2, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- HANDBALL
- KARINMNAGAR
- MANTHANI
- WARANGAL
- కరీంనగర్
- మంథని
- వరంగల్
- హ్యాండ్ బాల్ సెలక్షన్
- Comments Off on 6 నుంచి హ్యాండ్ బాల్ సెలక్షన్స్