Breaking News

గురుకుల డిగ్రీ ఎంట్రెన్స్ ​ఫలితాలు విడుదల

గురుకుల డిగ్రీ ఎంట్రెన్స్​ఫలితాలు విడుదల

సారథి, హైదరాబాద్: తెలంగాణ గురుకుల అండర్‌ గ్రాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(టీజీయూజీసెట్‌) ఫలితాలను గురుకులాల కార్యదర్శి డాక్టర్ ​ఆర్‌ఎస్ ​ప్రవీణ్​కుమార్​ శనివారం విడుదల చేశారు. బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ మొదటి సంవత్సరం కోర్సుల్లో ప్రవేశ పరీక్షను ఈనెల 11వ తేదీన నిర్వహించారు. ఎంపికైన విద్యార్థులకు ప్రాథమికంగా వారికి కేటాయించిన కాలేజీల్లో ఈనెల 19, 20, 21 తేదీల్లో మొదటి దశ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని వివరించారు. పూర్తి వివరాల కోసం www.tswreis.in అలాగే www.tgtwgurukulam.telangana.gov.in వెబ్‌సైట్లను సందర్శించాలని సూచించారు. సంబంధిత వెబ్​సైట్లలో విద్యార్థి నమోదుచేసిన కాంటాక్ట్ ​సెల్ ​నంబర్, పుట్టిన తేదీని ఎంట్రీ చేస్తే ర్యాంకు కార్డు వస్తుంది.