సారథి, రామడుగు: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 5వ తరగతిలోకి ప్రవేశానికి నిర్వహించే వీటీజీ సెట్ ను ఈనెల 18న ఆదివారం నిర్వహించనున్నట్లు గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించినట్లు స్వేరోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లెపల్లి తిరుపతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ విద్యార్థులు హాల్ టిక్కెట్లు మీసేవ నుంచి గాని ఆన్‌లైన్ సర్వీస్ నుంచి గాని డౌన్‌లోడ్‌చేసుకోవాలని ఆయన సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను పరీక్ష కేంద్రాలకు సురక్షితంగా తీసుకొనిపోవాలని, కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించి ఉపాధ్యాయులకు సహకరించాలని కోరారు.
- July 14, 2021
- Archive
- స్టడీ
- GURUKULAM
- RS PRAVEENKUMAR
- tgcet
- ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
- గురుకులం
- టీజీసెట్
- Comments Off on 18న గురుకుల 5వ తరగతి ఎంట్రెన్స్ టెస్ట్