సామాజిక సారథి, మందమర్రి(మంచిర్యాల): మనోవికాస్ కు జీఎస్ఆర్ ఫౌండేషన్ చేయూతనందించిదని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ రాజా రమేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు, గురువులు మనకు దైవంతో సమానమని మానసికంగా ఇబ్బంది పడుతున్న పిల్లలకి తోచినంత సహాయం చేద్దామని పిలుపునిచ్చారు. అలాగే సింగరేణి సంస్థ ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేసి, వారిని పర్యవేక్షిస్తున్నందుకు సింగరేణి సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు అకినపల్లి సురేష్, బద్రి సతీష్, కిరణ్ కుమార్, సురేష్, వేల్పుల సత్యనారాయణ, గోనె ప్రకాష్ దంపతులు, రవి తదితరులు పాల్గొన్నారు.
- October 26, 2022
- లోకల్ న్యూస్
- CHEYUTHA
- Foundation
- GSR
- Manchryala
- mandamarri
- Manovikas
- Comments Off on మనోవికాస్ కు జీఎస్ఆర్ ఫౌండేషన్ చేయూత