సారథి, పెద్దశంకరంపేట: హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పెద్దశంకరంపేట ఎంపీడీవో రాంనారాయణ అన్నారు. శుక్రవారం పెద్దశంకరంపేట ఎంపీడీవో కార్యాలయంలో ఆయాశాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి గ్రామంలో నర్సరీల నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో మురికి కాల్వలు శుభ్రం చేయాలని, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీవో రియాజుద్దీన్, ఈజీఎస్ ఏపీవో సుధాకర్, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
- June 18, 2021
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- egs
- HARITHAHARAM
- PEDDASHANKARAMPET
- ఈజీఎస్
- పెద్దశంకరంపేట
- హరితహారం
- Comments Off on హరితహారంను విజయవంతం చేయాలి