సారథి, చొప్పదండి: చొప్పదండి పట్టణ కేంద్రంలోని 6వ వార్డులో ఉన్న గ్రంథాలయాన్ని ఆధునికరించడానికి తక్షణమే నిధులు మంజూరుచేసి, సరైన వసతులు కల్పించాలని స్థానిక 6వ వార్డు కౌన్సిలర్ వడ్లూరి గంగరాజు శుక్రవారం ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డిని కలసి వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం ఉన్న గ్రంథాలయానికి మరమ్మతులు చేయించి కనీస వసతులు ఏర్పాటుచేసి ప్రశాంతమైన వాతావరణం కల్పించాలన్నారు. పోటీ పరీక్షల బుక్స్ ను లైబ్రరీకి అందివ్వాలని, పేద, మధ్యతరగతి యువతీయువకులు కొలువుల సాధనకు ఒక మోడల్ తీర్చిదిద్దాలని కోరారు. కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్ వెలమ మల్లారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ అరెల్లి చంద్రశేఖర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొత్త గంగారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు గుడిపాటి వెంకట రమణారెడ్డి పాల్గొన్నారు.
- July 9, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CHOPPADANDI
- LIBRARY
- mla ravishnakar
- ఎమ్మెల్యే సుంకే రవిశంకర్
- చొప్పదండి
- లైబ్రరి
- Comments Off on లైబ్రరీకి నిధులు మంజూరు చేయండి