సారథి, వేములవాడ: ఏఐసీసీ పిలుపుమేరకు శనివారం వేములవాడ నియోజకవర్గం రుద్రంగి మండల కేంద్రంలో కార్మికులతో పాటు పలువురికి మాస్కులు పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి విలయతాండవగా చేస్తున్న తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమై ప్రజల ప్రాణాలు పోతున్నాయని ఆయన అన్నారు. కొవిడ్ బాధితులకు రెమిడెసివిర్ఇంజక్షన్లు, అక్సిజన్అందించడంలో, ఆస్పత్రుల్లో బెడ్లు సమకూర్చడంలోనూ ప్రభుత్వాలు విఫలమయ్యాయని ధ్వజమెత్తారు. ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి చిలకల తిరుపతి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బైరిగంగ మల్లయ్య, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, సామ మోహన్ రెడ్డి పల్లి గంగాధర్, గుగ్గిళ్ల వెంకటేశ్, నారాయణ, అభిలాష్, గణేష్, రవి, అనిల్, చింటు, వినయ్, సన్నీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
కరోనా వేళ ఆదుకోవాలి
కార్మిక లోకానికి కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ మే డే శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ పురోగతిలో శ్రమజీవుల పాత్ర ఎనలేనిదని కొనియాడారు. కార్మిక చట్టాలు పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇబ్బంది పడుతున్న కార్మికుల కుటుంబాలను పాలకులు ఆదుకోవాలని డిమాండ్ చేశారు.