సారథి, చొప్పదండి: చొప్పదండి మండలానికి చెందిన 24 మంది లబ్ధిదారులకు రూ.5,41,500 సీఎం సహాయ నిధి చెక్కులను శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నిరంతరం కృషిచేస్తున్నారని కొనియాడారు. గతంలో ముఖ్యమంత్రి సహాయ నిధి అంటే ఎవరికీ తెలిసేది కాదన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయం అందుతుందన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, చకుంట సర్పంచ్ పెద్దిశంకర్, పలువురు లబ్ధిదారులు పాల్గొన్నారు.
- July 31, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CHOPPADANDI
- CM RELIEFFUND
- MLA RAVISHANKAR
- ఎమ్మెల్యే రవిశంకర్
- చొప్పదండి
- సీఎం కేసీఆర్
- Comments Off on ఆపదలో ఉన్నవారికి సర్కారు అండ