సారథి, చొప్పదండి: తెలంగాణలో గోహత్యలు, గోరక్షకులపై దాడులకు నిరసనగా విశ్వహిందూ పరిషత్(వీహెచ్పీ) చొప్పదండి శాఖ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వీహెచ్పీ మండలాధ్యక్షుడు పడకంటి కృష్ణ మాట్లాడుతూ.. గోరక్షకుడు సంజయ్ పై హత్యాయత్నం చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గోహత్య నిరోధక చట్టాలను కఠినంగా అమలుచేయాలని, గో అక్రమ రవాణా గ్యాంగ్ ల పై పీడీ యాక్టు నమోదు చేయాలని, గోవుల అక్రమ రవాణా నిలుపుదలకు శాశ్వత చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని కోరారు. గోవధ శాలలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్చేశారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ కార్యదర్శి పొన్నాల తిరుపతి, కోశాధికారి దండే మహేష్, రాంలీల కోకన్వీనర్ బత్తిని ప్రశాంత్, తాడూరి శివకృష్ణ, గుర్రం సమర్ రెడ్డి, పరమేష్, రేసవేని వేణు, చిలుముల కార్తిక్, ఎనగందుల అజయ్ పాల్గొన్నారు.
- July 5, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CHOPPADANDI
- vhp
- vishwa hindu
- గోరక్షకులు
- చొప్పదండి
- విశ్వహిందూ పరిషత్
- వీహెచ్పీ
- Comments Off on వీహెచ్ పీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం