Breaking News

‘గౌడబంధు’ ప్రకటించాలి..

‘గౌడబంధు’ ప్రకటించాలే

సామాజిక సారథి, రామాయంపేట: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 371వ జయంతి వేడుకలను బుధవారం నిజాంపేట మండల కేంద్రంలోని నూతన బస్టాండ్ సమీపంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పాపన్న చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నికులాలకు కేటాయిస్తున్న సంక్షేమ పథకాలను గౌడ కులస్తులు కూడా కేటాయించాలని కోరారు. అలాగే దళితబంధు మాదిరిగా గౌడబంధు కూడా ప్రకటించాలని, గౌడ కులస్తులకు సబ్సిడీపై మోటారు సైకిళ్లను కేటాయించాలని వారు కోరారు. కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు కిషోర్ గౌడ్, చిరంజీవిగౌడ్, వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్, జీడి పరశురాములు గౌడ్, జీడి యాదగౌడ్, బజార్ యాదగౌడ్, బజార్ చిన్న ప్రశాంత్ గౌడ్, జీడి చంద్రకాంత్ గౌడ్, బొప్పాపురం రాజుగౌడ్, శ్రీనివాస్, నగేష్, స్వామి, కోటేశ్వర్, బాలాగౌడ్, మధు, సాయి, సంఘం సభ్యులు పాల్గొన్నారు.

తొర్తి గ్రామంలో జయంతి వేడుకలు

పాపన్న సేవలు అజరామరం
సామాజిక సారథి, బాల్కొండ(ఏర్గట్ల): నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం, తొర్తి గ్రామంలో బుధవారం సర్దార్ సర్వాయి పాపన్న 371వ జయంత్యుత్సవాలను ఘనంగా ఘనంగా జరుపుకున్నారు. తుపాకుల నారాగౌడ్ పాపన్నగౌడ్ జీవిత చరిత్ర, పోరాట పటిమను కొనియాడారు. కార్యక్రమంలో సర్పంచ్ కుండ నవీన్, ఉపసర్పంచ్ తాహేర్, మాజీ కోఆప్షన్ సభ్యుడు అజ్మత్, బీజేపీ అధ్యక్షుడు కౌడ లింబాద్రి, టీఆర్ఎస్​నాయకులు ఆకుల రాజేందర్, రాజన్న, బీసీ సంఘం నాయకులు గోడ్కే రవీందర్ కటిక పాల్గొన్నారు.