సారథి, చొప్పదండి: చొప్పదండి టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బంధారపు అజయ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్లో ఆఫీసులో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్ జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ హాజరై కేక్ కట్ చేశారు. వినోద్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సీఎం కేసీఆర్ కుడి భుజం మాదిరిగా పనిచేశారని, ఇప్పుడు బంగారు తెలంగాణ నిర్మాణంలోనూ ఆయన ఆలోచన విధానం కీలకమని కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీపీ చిలుక రవీందర్, మున్సిపల్ చైర్పర్సన్గుర్రం నీరజ భూమారెడ్డి, జిల్లా రైతుబంధు సమితి సభ్యులు మచ్చ రమేష్, మార్కెట్ వైస్ చైర్మన్ కొత్త గంగిరెడ్డి, ఆత్మ చైర్మన్ తూము మల్లారెడ్డి, డైరెక్టర్ బిసవేని రాజశేఖర్, కౌన్సిలర్లు కొత్తూరి మహేష్, మాడిరి శ్రీనివాస్, మహేశుని మల్లేశం, దండే కృష్ణ, బత్తిని సంపత్, మండల కోఆప్షన్ సభ్యుడు పాషా, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు అజ్జు, బీసీ సెల్ అధ్యక్షుడు ఎం.మహేష్, సందీప్, అనిల్ టిల్లు, రిషి రాజ్, చోటు, నితీష్ పాల్గొన్నారు.
- July 22, 2021
- Top News
- CHOPPADANDI
- CM KCR
- vinodkumar
- చొప్పదండి
- వినోద్‌కుమార్
- సీఎం కేసీఆర్
- Comments Off on ఘనంగా వినోద్‌కుమార్ జన్మదిన వేడుకలు