సారథి, పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేట మండల పరిధిలోని గొట్టుముక్కల గ్రామంలో వీరభద్రస్వామి ఆలయంలో నాలుగో వార్షికోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో శనివారం ప్రారంభమైన నాలుగో వార్షికోత్సవ వేడుకలు, స్వామివారి ఆభరణాల ఊరేగింపు అనంతరం అభిషేకంతో ముగిశాయి. స్వామివారికి ఆభరణాలను అలంకరించి ధూపదీప నైవేద్యాలతో ఘనంగా పూజలు చేశారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వార్షికోత్సవంలో భాగంగా ఆలయంలో భక్తులకు అన్నదానం చేశారు. దేవస్థానం వద్ద సత్రాల నిర్మాణం, వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. దాతలు విరివిగా విరాళాలు అందించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. కార్యక్రమంలో గ్రామపెద్దలు, ఆలయ అర్చకులు, భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
- April 21, 2021
- Archive
- gottumukka
- PEDDASHANKARAMPET
- veerabadraswamy
- గొట్టుముక్కల
- పెద్దశంకరంపేట
- వీరభద్రస్వామి
- Comments Off on ఘనంగా వీరభద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు