Breaking News

ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు..

ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు..


నేటి రాశిఫలాలు
1 మే 2021
శనివారం

తిథి: పంచమి రాత్రి 10.14
నక్షత్రం: మూల, పగలు.3.38
యోగం: శివ 4:41
కరణం: కౌలవ 5:51
రాహుకాలం: ఉదయం 9.00 గంటల నుంచి 10.30
యమగండం: పగలు1.30 గంటల నుంచి 3.00 వరకు
వర్జ్యం: రాత్రి 12.47 గంటల నుంచి 2.19
దుర్ముహుర్తం: ఉదయం 6.00 గంటల నుంచి 7.36

మేషం: కుటుంబ వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వృత్తి, ఉద్యోగంలో అధికారుల చేత శభాష్​ అనిపించుకుంటారు. స్త్రీలు షాపింగ్‌లో దుబారా ఖర్చులు ఎక్కువగా చేస్తారు. స్థిరాస్తివివాదాలు పరిష్కారమై ధనప్రాప్తి కలుగుతుంది. మిత్రులతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగులకు వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. కోపంతో పనులు చక్కబెట్టలేరు. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు నిర్మాణ పనుల్లో ఏకాగ్రత ముఖ్యం.

వృషభం: ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మానసికంగా ఒత్తిడికి గురిచేస్తాయి. ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించి మీ పనులు సానుకూలమవుతాయి. దైవారాధన పట్ల ఆసక్తి పెరుగుతుంది. బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. కోపాన్నిఅదుపులో ఉంచుకోవడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు కొంత ఆశాజనకంగా ఉంటాయి . గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో కొత్త ఆలోచనలు అమలు చేస్తారు. మిత్రులను కలుసుకుంటారు. పెద్దలతో ఏకీభవించలేకపోతారు. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించడం మంచిది కాదు. వ్యాపారవర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలుదారులను ఆకట్టుకుంటాయి.

మిథునం: కీలక వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరికీ పెద్దమొత్తంలో నగదు చెల్లింపు మంచిదికాదు. కుటుంబసభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పెద్దల ఆరోగ్యంలో సంతృప్తి కలుగుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు అనుకూల సమయం. నూతన వాహన యోగం ఉంది. వృథాఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. శుభకార్యాల ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగస్తులు సభ, సమావేశాల్లో పాల్గొంటారు. అతిథి మర్యాదలు బాగా నిర్వహిస్తారు. దూరప్రయాణాల్లో వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం.

కర్కాటకం: ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. సంతానం విద్యా, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. నూతనంగా చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. దూరప్రాంతాల వారి నుంచి కీలక సమాచారం అందుతుంది. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. దైవకార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగతుంది. వస్త్రవ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండడం మంచిది. మీ పనులు మందకొడిగా సాగుతాయి. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, ఇతరత్రా చికాకులు అధికమవుతాయి.

సింహం: వృత్తి, వ్యాపారాల్లో స్వల్పలాభాలు అందుతాయి. ఊహించని ఆహ్వానాలు కొంత ఊరట కలిగిస్తాయి. ఆర్థిక విషయాల్లో స్వల్ప ఒడిదుడుకులు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. ప్రయాణాల్లో మార్గఅవరోధాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు జాప్యం జరిగిన నిదానంగా పూర్తిచేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మిత్రుల వల్ల ఆర్ధిక లబ్ది పొందుతారు. ఏసీ కూలర్, మెకానికల్ రంగాల్లో వారికి సంతృప్తి కనిపిస్తుంది. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.

కన్య: పాత మిత్రులను కలుసుకుని కొన్ని విషయాలు చర్చిస్తారు. భూ సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు. వాణిజ్య ఒప్పందాలు, లీజు, ఏజెన్సీలు, కాంట్రాక్టుల గడువు పొడిగింపునకు అనుకూలంగా ఉంటుంది. షేర్ల క్రయవిక్రయాలు లాభం చేకూర్చుతాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబసభ్యులతో ఇంటిలో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సోదరీ, సోదరులతో అనుకోని ఇబ్బందులు చికాకులను ఎదుర్కొంటారు. పత్రికా ఉద్యోగస్తులకు ఏకాగ్రత, జాగ్రత్తలు చాలా అవసరం. రాజకీయ నాయకులకు అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.

తుల: ద్విచక్ర వాహనం నిదానంగా నడపటం క్షేమదాయకం. మిత్రులతో ఏర్పడిన మనస్పర్థలు పరిష్కరించుకుంటారు. గృహనిర్మాణ ఆలోచనలలో మందకొడిగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి పుంజుకుంటుంది. దీర్ఘకాలిక రుణాలు కొంత మేరకు తీరుతాయి. నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి. ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. రాజకీయాల్లో ఉన్నవారికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఆత్మీయులతో ఒక పుణ్యక్షేత్ర సందర్శనకు సన్నాహాలు చేస్తారు. గతంలో ఎదురైనా నిరాశలు మళ్లీ ఆశాజనకంగా మారుతాయి. ప్రముఖులకు సహకరించడం వల్ల మీరు ఎంతో పొందుతారు.

వృశ్చికం: సోదరుల నుంచి ధనలాభాలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధుమిత్రుల నుంచి కొత్త సమస్యలు తలెత్తుతాయి. మిత్రుల నుంచి అందిన ఆహ్వానాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సంఘంలో గౌరవం మర్యాదలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలు పెట్టుబడులకు చాలా అనుకూల సమయం. నిరుద్యోగులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలను అందుకుంటారు. ఎవరికీ పెద్దమొత్తంలో నగదు చెల్లింపు మంచిది కాదు. మీ వ్యవహార జ్ఞానం, పట్టుదల కొంతమందికి స్ఫూర్తినిస్తుంది. నూతన దంపతులు కొత్త అనుభూతికి లోనవుతారు.

ధనుస్సు: వృత్తి వ్యాపార కీలక ఆలోచనలతో ముందుకు సాగుతారు. హామీలిచ్చే విషయంలో లౌక్యంగా ఉండాలి. కలెక్షన్ ఏజెంట్లు వసూళ్లలో సంయమనం పాటించాలి. ఇంటాబయట సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఆర్థికంగా మరింత అనుకూలత పెరుగుతుంది. నిరుద్యోగులు కొంత ఓర్పుతో వ్యవహరించాలి. ఎవరికీ పెద్దమొత్తంలో నగదు చెల్లింపు మంచిది కాదు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు, సమయం వృథా వంటి చికాకులు ఎదుర్కొంటారు. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించడం మంచిది కాదని గమనించండి.

మకరం: చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అనవసరపు విషయాల్లో ఉద్రేకం మాని తెలివితేటలతో ముందుకు సాగి జయం పొందండి. ఏమాత్రం ధనం నిల్వ చేయలేకపోతారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి డబ్బు అందుతుంది. రుణ ఒత్తిడి నుంచి బయటపడతారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. నూనె, ఎండుమిర్చి, బెల్లం, చింతపండు వ్యాపారులకు కలిసి వచ్చేకాలం. వ్యాపారాల్లో ఉన్నతి కలుగుతుంది. స్త్రీలకు బంధువులతో పేరు, ఖ్యాతి లభిస్తాయి. మీ బలహీనతలు, అలవాట్లు ఇబ్బందులకు దారితీస్తాయి.

కుంభం: ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. కొన్ని రంగాల వారికీ తగిన గుర్తింపు లభిస్తుంది. దీర్ఘకాలిక వివాదాలు తీరి ఆర్థికంగా లబ్ధిపొందుతారు. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. సంఘంలో పెద్దల సహాయం అందుతుంది. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు మరింత కష్టపడాలి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. వీలైనంతవరకు మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. దైవదర్శనాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. బ్యాంకు పనుల్లో జాప్యం ఇతర వ్యవహారాలపై ప్రభావం చూపే ఆస్కారం ఉంటుంది. విందుల్లో పరిమితి పాటించండి.

మీనం: కుటుంబపెద్దల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. కలిసొచ్చిన అవకాశాన్ని తక్షణం చేజిక్కించుకుంటారు. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. కీలక విషయాలలో కుటుంబసభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి వ్యాపారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగాల్లో కొంత ఒత్తిడి ఉన్నపటికీ పనులు పూర్తిచేస్తారు. వివాహ, విదేశీయానం, రుణ యత్నాలు కొలిక్కి వస్తాయి. వ్యాపార, ఉద్యోగ ప్రకటనలపై జాగ్రత్త వహించండి. నిరుత్సాహం వీడి ఉద్యోగయత్నం సాగించండి.
:: బ్రహ్మశ్రీ విప్పర్ల మహేశ్ విశ్వకర్మ గురూజీ,
ప్రముఖ జ్యోతిష్య పండితులు,
సెల్​నం.95020 59649